జనసేన అధ్యక్షుడు తాజాగా ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి హరిద్వార్ చేరుకున్నారు. హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి వెళ్లి ఆ ఆశ్రమ నిర్వాహకులు శివానంద మహారాజ్ ను కలిసారు. ఈ క్రమంలో శివానంద మహారాజ్ పవన్ కు గంగానది కలుషితం పై పలు అంశాలను వివరించారు. దానికి పవన్ తాను కూడా గంగా నది కాలుష్యం బారిన పడకుండా పోరాటం చేస్తానని, గంగా నదిని కలుషితం చేస్తే మన సంస్కృతిని కలుషితం చేసినట్టేనన్నారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ గంగానది ప్రక్షాళన చేయడం మంచిదేనని, అలాగే కాలుష్యం బారిన పడకుండా గంగానదిని కాపాడడం మంచిదేనని కాకపోతే గెలిచినా ఓడినా భీమవరం లోనే ఉంటాను భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్ అనే ఓ మురికి కాలువలు ప్రక్షాళన చేస్తాను, కాలుష్యం నుండి కాపాడండి అంటూ చేసిన వ్యాఖ్యలను పవన్ కు భీమవరం జనసైనికులు గుర్తుచేస్తున్నారు. మందు భీమవరం మురికి కాలువ సంగతి చూడాలని దాని పైన పోరాటం చేయాలని వందల గ్రామాలకు సాగునీరు వెళ్లే యనమదుర్రు డ్రెయిన్ ప్రక్షాళన చేసిన తరువాత గంగానదిని ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు.
