తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీపి కబురును అందించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గత కొన్ని నెలలుగా పలు శాఖాల్లోని ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడక తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు.
ఇందులో ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెండు నుంచి మూడు నెలల జీతాలు రావాల్సి ఉంది. దీంతో ఈ సమస్యపై చర్చించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు,వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రతి నెల ఏడో తారీఖునే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.