తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతున్నారు.
అందుకే ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు భారీ తీర్పునిచ్చారు. అయిన కానీ ప్రతిపక్షాలకు బుద్ధి రాలేదు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నిన్న శుక్రవారం మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ క్రమంలో పలు చోట్ల సీసీ రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేశారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ” హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆదరించినట్లే ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడం లేదు “అని అన్నారు.