రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో మ్యాన్ హోల్స్ లోంచి చెత్తను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే నగరంలోని హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గతంలో మ్యాన్ హోల్స్ లో చెత్త తీసే పనుల్లో దురదృష్టవశాత్తు పలువురు సఫాయి కార్మికులు మరణించారని.. అలాంటి ఘటనలు పురావృతం కాకుండా రోబోటిక్ యంత్రంతో పూడికతీత పనులు చేయిస్తామన్నారు. దీంతో పగలే కాకుండా రాత్రి సమయంలోనూ పనులు చేయొచ్చని చెప్పారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని మేయర్ తెలిపారు. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన హాజరయ్యారు.
#GHMC launches #Robotic desilitation of #sewer manholes. This eliminates #human cleaning n handling of #sewage giving #dignity to our #sanitation staff.@KTRTRS @MinisterKTR @arvindkumar_ias @CommissionrGHMC #Hyderabad #MyCleanIndia #Robotics #endmanualscavenging @ani_digital pic.twitter.com/lFrBkaGYWc
— Hari Chandana IAS, Zonal Commr, West Zone GHMC (@zcwz_ghmc) November 5, 2019
Hope to see off manual cleaning of manholes in the city soon. Introduced #Bandicoot a robotic machine along with MLA Gandhi garu, corporator Jagadish garu, @zcwz_ghmc DC Yadagiri garu and other officials. It cleans automatically.@arvindkumar_ias @KTRTRS @GHMCOnline pic.twitter.com/aRmRX3yORe
— BonthuRammohan,Mayor (@bonthurammohan) November 5, 2019