ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన నోకియా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.20,499 విలువైన నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ పేరిట రూ9,999లకే అమెజాన్ లో అందిస్తుంది. 6జీబీ ర్యామ్ ,64జీబీ ధర అమెజాన్ లో రూ.9,999లు ఉంది. మరోవైపు ఇదే ఫీచర్లతో ఫ్లిప్ కార్టులో రూ.12,290 లుగా ఉంది. మొత్తం 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ +డిస్ ప్లేతో పాటుగా స్క్రీన్ రిజల్యూషన్ 2280×1080 పిక్సెల్ గా ఉంది. ఇక క్యాల్ కాం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది.సెల్ఫీ ప్రియుల కోసం 16 ఎంపీ సామర్థ్యమున్న AI కెమెరా కూడా ఉంది.
