అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఆర్య తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లవర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్షకులని ఎంతగానో కట్టిపడేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ తన ఇన్‌స్టాగ్రాములో పోస్ట్ పెట్టారు. ఇప్పటికీ నేను అంతే ప్రేమను ఫీలవుతున్నాను.
నా జీవితంలో మోస్ట్ మ్యాజికల్ చిత్రం ఆర్య. ఈ చిత్రం నా జీవితాన్నే మార్చేసింది. ఈ చిత్రం విడుదలై 15 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నాను” అని అన్నాడు.ఇక ఆర్య చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఆర్య 2 చిత్రం 27 నవంబర్, 2009న విడుదల కాగా, నేటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా బన్నీ తన ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. సినిమాలోని లిరిక్ ఉప్పెనంత ఈ ప్రేమకి, గుప్పెడంత గుండె ఏమిటో అని రాసి, నా హృదయం ఇప్పటికి సరిపోవడం లేదు.
మీరు చూపించిన ప్రేమకి ధన్యవాదాలు. ఆర్య, ఆర్య2 వంటి హిట్స్ ఇచ్చిన సుక్కూకి ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ.. నా ప్రాణం పోయినా.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను అని సుక్కూపై తనకున్న ప్రేమని చాటుకున్నాడు బన్నీ. త్వరలో బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే.