టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గిరిజన యువ పారిశ్రామికవేత్త కుర్సం గౌతమి హైదరాబాద్ నగరంలోని హిమయత్ నగర్‌లో చీజ్‌యానో పిజ్జా సెంటర్‌ను స్థాపించారు. కుర్‌సం గౌతమి ఐఎస్‌బీ నుండి సీఎంఎస్‌టీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్(CMSTEI) పథకం కింద శిక్షణ పూర్తిచేసుకుని లోన్ తీసుకుని ఈ పిజ్జా సెంటర్‌ను నెలకొల్పారు. గతంలో లోన్ పత్రాల అందజేత కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ బిజినెస్ ప్రారంభోత్సవానికి వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కేటీఆర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పిజ్జా సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ యువ పారిశ్రామికవేత్తల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. గిరిజన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రిన్యువర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కింను తీసుకొచ్చారని చెప్పారు. ప్రతి గిరిజన బిడ్డ ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేసి ఇతరులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
Glad to have kept my word to young entrepreneur Kursam Gauthami ☺️ https://t.co/5ynT71TtsX
— KTR (@KTRTRS) November 28, 2019