Home / SLIDER / పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

పాలకుర్తి నియోజవర్గ అభివృద్ధి పై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం

పాలకుర్తి నియోజవర్గంలోని ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన అన్ని రకాల పనులను త్వరగా పూర్తి చేయాలని చెయ్యాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఎస్.డి.ఎఫ్ నిధులతో చేపట్టిన పనులపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాల శాఖ, విద్యా శాఖ ఇంజనీరింగ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల వారీగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా పనుల జాబితా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్సి, ఎస్టీ కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని… స్థానిక అవసరాలకు తగినట్లుగా పనులను మార్చుకుని సత్వరం పూర్తి అన్నారు. ఆరు మండలాల్లో కలిపి దాదాపు రూ.4 కోట్లతో పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు.


రోడ్ల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు. కొత్త గ్రామపంచాయతీలకు భవన నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని కొత్త జీపీలలో 20 శాతం వాటికి తొలిదశలో భవనాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. భూమి లభ్యత ఉన్న జీపీలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పీఆర్ ఎస్ఈ సంపత్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.