మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా..అయితే ఈ ఏడాది జూన్ నెలలో చోటు చేసుకున్న సినీ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..?.
జూన్ నెల మొత్తంలో మొత్తం పద్నాలుగు తెలుగు మూవీలు విడుదల అయ్యాయి.యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ,అక్కినేని కోడలు సమంత నటించిన ఓ బేబీ సినిమాలు మంచి హిట్ సాధించాయి.మిగతా సినిమాలు ఒక మోస్తారుగా ఆడాయి.
ఎన్నో అంచనాలతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ,సందీప్ కిషన్ నిన్ను వీడని నీడను నేనే,మరో యువహీరో ఆది బుర్రకథ సినిమాలు ఆడకుండా చేతులు ఎత్తేశాయి.వీటితో పాటు వచ్చిన నేను లేను,MR KK,ఆమె,దొరసాని,రాజ్ ధూత్,KS100.మార్కెట్లో ప్రజాస్వామ్యం,కాకతీయుడు,దుర్మార్గుడు సినిమాలు ఇలా విడుదలై అలా వెళ్లిపోయాయి..