Home / EDITORIAL / ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు ఉప నదిపై సిరిసిల్ల సమీపంలో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్‌ మానేర్‌ రిజర్వాయర్‌) కాళేశ్వరం ప్రాజెక్టులన్నింటికీ ఒక అనుసంధానకర్తగానే కాకుండా మత్స్య పారిశ్రామికరంగం సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా విలసిల్లడానికి అనుకూలమైన అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి. గోదావరి నదీ పరీవాహక ప్రాంతానికి భౌగోళికంగా మధ్యప్రాంతంలో ఉండటం, మానేరు నదిపైనే ఈ జలాశయాన్ని ఏర్పాటుచేయడం, ఒకవైపు శ్రీరాంసాగర్‌ భారీ ప్రాజెక్టు నుంచి వరదకాలువ ద్వారా అనుసంధానం కావడం, మరోవైపున ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీటిని తరలించుకునేందుకు ఏర్పాటు కలిగి ఉండటంలాం టి అనేక సౌకర్యాల ఫలితంగా సంవత్సరం పొడవునా పూర్తిస్థాయి నీటిమట్టంతో నింపి ఉంచేందుకు వెసులుబాటును కలిగి ఉండటంతో ఈ జలాశయం పరీవాహకంలో మత్స్యరంగ అభివృద్ధికి అదనపు అవకాశాలుగా ఉపయోగపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల మధ్యన విస్తరించిన డెల్టాలోని కొల్లేరు పరీవాహకంలో కేంద్రీకృతమై న ‘ఆక్వా’ రంగం మాదిరిగానే మిడ్‌ మానేరు పరీవాహక ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘ఫిషరీస్‌ హబ్‌’గా తీర్చిదిద్దేందుకు అనేకమైన అంశాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి.

గరిష్ఠ స్థాయి నీటి నిలువతో సుమారు 26 టీఎంసీల నీటిసామర్థ్యం తో ఇటీవలనే పూర్తిస్థాయిలో ఉనికిలోకి వచ్చిన మధ్యమానేరు జలాశ యం 7872 హెక్టార్ల (19,680 ఎకరాలు) నీటి విస్తీర్ణాన్ని కలిగి సముద్ర మట్టానికి 318 మీటర్ల ఎత్తులో ఉన్నది. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకున్నప్పుడు భూమి ఉపరితలం నుంచి సుమారు 30 మీటర్లలోతు, ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు ఉన్నప్పుడు 21 మీట ర్ల, కనిష్ఠంగా ఐదు టీఎంసీల నీరు నిలువ ఉన్న సందర్భాల్లో 17 మీట ర్ల లోతు ఉంటుంది. అందువల్ల అత్యాధునిక పద్ధతుల్లో చేపల పెంపకానికి ఈ ప్రాజెక్టు ఎంతో అనువైనదిగా మత్స్యశాఖ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ‘కేజ్‌ కల్చర్‌’ పద్ధతిలో చేపలను పెంచేందుకు ఈ జలాశయం చాలా ఉపయోగకరమైనదిగా వీరు చెబుతున్నారు. కేంద్ర జల సంఘం నిర్దేశాల ప్రకారం ఒక రిజర్వాయర్‌లోని ఒక శాతం నీటిని ఆధునిక పద్ధతుల్లో చేపలను పెంచేందుకు కేటాయించవచ్చు. అంటే మిడ్‌మానేర్‌ జలాశయానికి సంబంధించిన మొత్తం నీటి విస్తీర్ణంలో కనీ సం 787 హెక్టార్ల నీటి విస్తీర్ణాన్ని ‘కేజ్‌ కల్చర్‌’ విధానంలో చేపలను పెం చేందుకు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ఒక్క యూనిట్‌ (10 పంజరాలు) కేజ్‌ కల్చర్‌ను ఏర్పాటుచేయడానికి 250 చదరపు మీటర్ల నీటి విస్తీర్ణం సరిపోతుంది. ఈ లెక్కన మిడ్‌ మానేరు జలాశయంలో చేప ల ఉత్పత్తికి ఆమోదించిన నీటి విస్తీర్ణం కలిగిన 20 కిలోమీటర్ల పరిధిలో సుమారు రెండు వేల కేజ్‌ కల్చర్‌ యూనిట్లను నిర్వహించుకునేందుకు అవకాశం ఉన్నది. సగటున ఒక కేజ్‌ కల్చర్‌ యూనిట్‌ నిర్వహణకు ఐదుగురు సభ్యులు ఉపాధి పొందినా ఈ జలాశయంలో పూర్తిస్థాయిలో చేప ల పెంపకం ఫలితంగా ప్రత్యక్షంగా కనీసం పదివేల మందికి శాశ్వత ఉపాధి లభిస్తుంది.

వీటిద్వారా ఏటా సుమారు 50 వేల టన్నుల చేపల ను ఉత్పత్తి చేయవచ్చు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో కనీసం ఆరువేల కోట్లరూపాయలు ఉంటుంది. జలాశయంలోని ఒక్క నీటిచుక్కను వృథా చేయకుండా, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక లక్ష్యాలకు ఎలాంటి విఘాతం కలుగకుండా వేలాదిమందికి అదనంగా ఉపాధిని అందిస్తూ, వేల కోట్ల రూపాయల విలువైన అదనపు ఉత్పత్తిని సాధించడం కంటే ప్రయోజనం ఇంకేముంటుంది? మిడ్‌మానేర్‌ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఇప్పటికే నిర్మించుకున్న వరదకాలువ కూడా చేపల ఉత్పత్తికి ఎంతో అనువుగా ఉంటుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి మిడ్‌ మానేరు వరకు సుమారు 122 కిలోమీటర్ల మేరకు 43 మీటర్ల వెడల్పు, పదిమీటర్ల లోతును కలిగిఉన్న గోదావరి వరదకాలువలో ఎల్లకాలం కనీసం ఒక మీటరు నుంచి రెండుమీటర్ల లోతులో నీరు మూడు నుంచి నాలుగు నెలల పాటు నిరంతరంగా నిలువ ఉన్నప్పటికీ ‘పెన్‌ కల్చర్‌’ విధానంలో చేప పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉంది. గడిచిన నాలుగేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సహకార సొసైటీలకు, మత్స్యశాఖ నిర్వహణలో ఉన్న చెరువుల్లో నూ, జలాశయాల్లోనూ ఉచిత చేపపిల్లలను సరఫరా చేస్తున్నది. వర్తమా న సంవత్సరంలో ఇప్పటికే సుమారు 66 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయడానికి సుమారు 80 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. ఇందులో మూడువంతుల చేప పిల్లలను ఆంధ్రా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది.

అందువల్ల ఈ వ్యయభారాన్ని తగ్గించుకోవడానికి, మరింత నాణ్యమైన చేప పిల్లలను స్థానిక పరిస్థితులకు తగినట్లుగా పెం చుకోవడానికి వరదకాలువ సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అవకాశాలున్నాయి. తద్వారా చేపపిల్లల దిగుమతిలో ఎదురవుతున్న రవా ణా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, వందలాదిమంది మత్స్యకారులకు చేపపిల్లల పెంపకంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలు కలుగుతుంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ర్టానికి అవసరమైన 150 కోట్ల చేప పిల్లలను మానేరు పరీవాహక ప్రాంతంలో నే ఉత్పత్తి చేసుకునేందుకు వీలున్న మార్గాలను అన్వేషించవలసి ఉన్నది. ఆధునిక టెక్నాలజీని వినియోగించి చేపలనుంచి అనేకరకాలైన ఉప ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. చేప వ్యర్థాల నుంచి ఫిష్‌ కేక్‌, ఫిష్‌ మీల్‌, ఫిష్‌ చిప్స్‌, ఫిష్‌ పౌడర్‌, ఫిష్‌ ఆయిల్‌, ఫిష్‌ క్యాప్యూల్స్‌ లాంటి అనేక రకాలైన తినుపదార్ధాలు, ముడి సరుకులు, మందులు తయారుచేయడానికి అవకాశాలున్నాయి. ఫిష్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నది. రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ లాంటి అనేక రూపాల్లో చేపల ఆహారం అందమైన పాకెట్ల రూపాలలో అందుబాటులోకి వస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎల్లంపల్లి ఒక నీటి సేకరణ కేంద్రంగా పనిచేస్తుండగా, మిడ్‌ మానేరు పంపిణీ జంక్షన్‌ లాగా ఉపయోగపడుతున్నది.

అందువల్ల కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ జలాశయమే ప్రధాన పాత్రను నిర్వహిస్తున్నది. కాళేశ్వరం నీటి పారుదల ప్రాజెక్టుల్లో అత్యధిక నీటినిలువ (50 టీఎంసీలు) సామర్థ్యాన్ని కలిగి ఉండే మల్లన్నసాగర్‌ భారీ జలాశయంతో పాటుగా అనంతసాగర్‌ (మూడు టీఎంసీలు), రంగనాయకసాగర్‌ (మూడు టీఎంసీలు), మలక్‌పేట జలాశయం (మూడు టీఎంసీలు), ఎగువమానేరు జలాశయం (రెండున్నర టీఎంసీలు) నిర్మిస్తున్నారు. వీటన్నింటికీ కలిపి 60 టీఎంసీలకు పైగానే నీటిని మధ్యమానేరు జలాశయం నుంచే ఎత్తిపోయాల్సి ఉంటుంది. కొత్తగా నిర్మిస్తున్న ఈ జలాశయాలన్నింటిలోనూ చేపల పెంపకానికి అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టుల నీటి నిలువ విస్తీర్ణంలో కనీసం మరో పదివేల హెక్టార్లు ఉంటుంది. ఈ జలాశయాలన్నింటిలో సంప్రదాయ చేపల పెంపకంతో పాటుగా ఆధునిక పద్ధతుల్లో చేపల పెం పకాన్ని నిర్వహించడం ద్వారా సంవత్సరానికి కనీసం మరో 50 వేల టన్నుల చేపలను ఉత్పత్తి చేసేందుకు అవకాశాలున్నాయి. అంటే మధ్యమానేరు జలాశయం నుంచి మల్లన్నసాగర్‌ వరకున్న జలాశయాలన్నింటిలోనూ కలిపి ఏడాదికి సగటున పదివేల కోట్ల రూపాయల విలువైన లక్ష టన్నుల మత్స్యసంపదను సృష్టించేందుకు అదనపు అవకాశాలు కలుగుతాయి. ఈ చేపల ఉత్పత్తికి అనుబంధంగా ఇంకా అనేకరకాలైన కుటీర, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పుకునేందుకు వీలుకలుగుతుంది.

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మిడ్‌ మానేరు పరీవాహకంలో చేపల దాణాకు సం బంధించిన మిల్లులను నెలకొల్పుకునేందుకు అవకాశాలు లభిస్తాయి. ఉత్పత్తిచేసిన చేపలను మార్కెట్‌కు తరిలించేందుకు వీలుగా ప్యాకింగ్‌, వాల్యూ ఆడిషన్‌, ఐస్‌ ఫ్యాక్టరీలు, ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి అవసరమైన రవాణా సదుపాయాలు, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, చేపల ను కొంతకాలం పాటు నిలువ చేయడానికి అవసరమైన కోల్డ్‌స్టోరేజీ గిడ్డంగులు, లాంటి అనేక అనుబంధ అవసరాలు సమకూర్చుకోవడాని కి అవకాశాలు కలుగుతాయి.

ఆధునిక టెక్నాలజీని వినియోగించి చేపలనుంచి అనేకరకాలైన ఉప ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నా రు. చేప వ్యర్థాల నుంచి ఫిష్‌ కేక్‌, ఫిష్‌ మీల్‌, ఫిష్‌ చిప్స్‌, ఫిష్‌ పౌడర్‌, ఫిష్‌ ఆయిల్‌, ఫిష్‌ క్యాప్యూల్స్‌ లాంటి అనేక రకాలైన తినుపదార్థాలు, ముడి సరుకులు, మందులు తయారుచేయడానికి అవకాశాలున్నాయి. ఫిష్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అనేది ఒక ప్రత్యేకమైన పరిశ్రమగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నది. రెడీ టు కుక్‌, రెడీ టు ఈట్‌ లాంటి అనేక రూపాల్లో చేపల ఆహారం అందమైన పాకెట్ల రూపాలలో అందుబాటులోకి వస్తున్నది. వీన్నింటినీ నిర్వహించేందుకు అవసరమైన ఉద్యోగులు, కార్మికులు అవసరమవుతారు. వారికి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణా కేంద్రాలు నెలకొల్పవలసి ఉంటుంది. ఏ పరిశ్రమ అయినా అభివృద్ధి చెందాలన్నా, అన్నిరకాలుగా నిలదొక్కుకోవాలన్నా ఆ పరిశ్రమ నిర్వహణకు అవసరమైన ముడిసరుకులు (చేపలు) లభ్యమయ్యే ప్రదేశాలను ఎంపిక చేసుకోవడమే ప్రాథమికమనే సూత్రాలను అనుసరించి మిడ్‌మానేరు పరీవాహక ప్రాంతాన్ని ఒక ప్రతిష్ఠాత్మకమైన ‘ఫిషరీస్‌ హబ్‌’గా అభివృద్ధి పరిచేందుకు అన్నిహంగులూ ఉన్నాయనడంలో అతిశయోక్తిలేదు!

(తెలంగాణ ఫిషరీస్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు)

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat