తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పటి ఉమ్మడి ఏపీలో కానీ కమిషన్ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరం సందర్భంగా తనని కలవడానికి వచ్చే అధికారులు,ప్రజలు,అభిమానులు బొకేలు,శాలువాలు తీసుకురావద్దు..వీటి స్థానంలో నోటు పుస్తకాలు,పెన్నులు,డిక్షనరీలు తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే.
చైర్మన్ ఎర్రోళ్ల పిలుపునందుకున్న యువకులు బుచ్చిబాబు కెపి,పీవీ గౌడ్,శ్రీకాంత్ ,ప్రశాంత్ కుమార్ కొండపర్తి,ముక్క శివకుమార్ ,శంకర్ తదితరులు నోటు పుస్తకాలు,పెన్నులు తీసుకువచ్చి కమిషన్ చైర్మన్ ఎర్రోళ్లను కమిషన్ కార్యాలయంలో కలిసి అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు..తన పిలుపునందుకు ని ముందుకు వచ్చిన యువతను ఎర్రోళ్ల అభినందించారు..
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కార్యాలయం బషీర్ బాగ్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి.. ఇందులో భాగంగా కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ,ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్,కమిషన్ సెక్రటరీ కరుణాకర్ లు కేకు కట్ చేశారు.అనంతరం ఇరువురు సిబ్బంది ,ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏడాది కూడా గతేడాది కంటే మిన్నగా పని చేసి ఎస్సీ,ఎస్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని చైర్మన్ ఎర్రోళ్ల సిబ్బందికి,ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
Post Views: 357