తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని క్యాంపు ఆఫీస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు.
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు యొక్క ఆవశ్యకతను ప్రచారంలో భాగంగా ప్రజలకు వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికే ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రజలతో పాటు, దేశ విదేశాల్లో ఉన్న ప్రవాస భ్రతీయులకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తున్నాం అని చెప్పారు.
టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తామని నాగేందర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ని కలిసిన వారిలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు, జనరల్ సెక్రటరీ రవి శంకర్ ధూపాటి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వీరేందర్ సాంబరాజు, అనిల్ పద్మ, సభ్యులు ఉన్నారు.