తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు బుధవారం భౌరంపేట్ చైతవ్య కళాశాల క్యాంపస్ ను సందర్షించారు. ఈ సందర్భంగా మమ్త్రి హారీష్ రావు మాట్లాడుతూ”మనిషి జీవితంలో ఏం సాధించాలన్నా… ఆత్మవిశ్వాసం అవసరం.విద్యార్థులు తమ లక్ష్యాలను ఆత్మవిశ్వాసం తో సాధించాలి.
గతంలోఎంసెట్‌ఉండేది….ప్రస్తుతం జాతీయ స్థాయిలో నీట్ గా మార్చారు.నీట్ పరీక్ష లలో మీరంతా మంచి ర్యాంకులు సాధించాలి.మంచి క్యాంపస్‌లో చదువుతున్నారు. తప్పకుండా మీరంతీ డాక్టర్లు అవుతారు.నేను మీకు చెప్పేది ఒక్కటే. సమాజం కేవలం వైద్యులను కోరుకోవడం లేదు. మానవత్వంతో కూడిన వైద్యులు కావాలి.సమాజంలోఎక్కువ గౌరవం పొందే వ్యక్తి డాక్టర్లే. మానవత్వంతో వైద్యం చేయకపోతే గౌరవం ఉండదు.
మీరు డాక్చర్లు అయ్యాక పేదవాళ్లను మరిచిపోవద్దు.డబ్బు హోదా ,సిరి సంపదలు ఇవ్వలేని సంతృప్తి, పేదలకు సాయం చేయజం వల్ల కలుగుతుంది.ఈ క్యాంపస్ లోఉన్న 400 మంది మానవత్వంతో కూడిన వైద్యులు కావాలని ఆకాంక్షిస్తున్నా అని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీశ్ రావు తన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పి యువతను ఆలోచింపజేశారు. ఆ సంఘటన ఏమిటో కింది వీడియోలో చూడండి.
Post Views: 465