Home / SLIDER / పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?

పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?

మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది .

9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది.

దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” అది ఫేక్ అని తేల్చి చెప్పింది.

తాము వినియోగదారులకు అలాంటి మెసేజ్స్ ఏమి పంపించడం లేదు. అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.