ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో నడవనున్నారు.
అప్పటి ఉమ్మడి ఏపీలో రెండో సారి అధికారాన్ని చేపట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమాన్ని ఎంచుకున్న సంగతి విదితమే.
ఇదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడవనున్నాడు. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి ఏపీ వ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమాభివృద్ధి పథకాలు,అమలు, అందుతున్న విధానంపై ప్రజల అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై పలు సూచనలు,అదేశాలను అధికారులకు జారీ చేయనున్నారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.