సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు.
అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి.
ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి అని ఆకాశవాణి నుండి మాటలు వినపడతాయి. వీటినే సమ్మక్క మాటలుగా కోయలు భావిస్తారు.