Home / SLIDER / సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.

సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు చేసిన సన్మాన సభలో మంత్రి ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, మిషన్‌ భగీరథ తదితర పథకాలను  దేశమంతా హర్షిస్తున్నదని చెప్పా రు.

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా  తె లంగాణ శాంతి, సహహనంతో ముందుకుసాగుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలంటేనే తెలంగాణ అన్న రీతిన పాలన చేస్తున్న  కేసీఆర్‌పై ఉన్న ద్వేషమే మోదీ చేసిన వ్యాఖ్యలకు అసలు కారణమని మంత్రి వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat