నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం. అయితే చాలా కాలం నుండి ఉన్న అజీర్ణం కూడా ఇందుకు ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ సమస్య నుండి ఉపశమపనం పొందాలంటే అనేక చిట్కాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాము. ధనియాలు 100గ్రాములు, జీలకర్ర 100గ్రాములు,వాము 50గ్రాములు,మిరియాలు 5గ్రాములు కలిపి పెనంపై వేయించాలి.
పొడి చేసి గోరు వెచ్చని నీటిలో ఉదయం సాయంత్రం తాగుతూ ఉండాలి. అలాగే పటిక ,ఉప్పు కలిపి వేడి నీళ్లలో వేసుకుని రోజూ రెండు మూడు సార్లు పుక్కలిస్తే సమస్య తగ్గిపోతుంది అని నిపుణులు అంటున్నారు.మీకు ఈ సమస్య ఉంటే వెంటనే ఈ చిట్కాలను పాటించండి మరి ఆలస్యం ఎందుకు..?