అక్కినేని వారసుడు యువహీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త అవతారమెత్తనున్నాడు. ఇప్పటికే అక్కినేని కుటుంబం పేరు చేబితే అక్కినేని నాగేశ్వరరావు,అక్కినేని నాగార్జున,అమల,అన్నపూర్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సంగతి విదితమే. వీరి సరసన చేరడానికి నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు కన్పిస్తుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ కు తరలిరావడానికి ప్రధాన కారణమైన వారిలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
ఇది కాకుండా కేవలం నాగార్జున మనం ఎంటర్‌టర్ ప్రైజెస్ బ్యానర్‌ను ప్రారంభించాడు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇప్పుడు నాగచైతన్య కూడా ఒక బ్యానర్‌ను స్టార్ట్ చేయబోతున్నాడట. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను, టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ తన బ్యానర్‌లో సినిమాలు నిర్మించాలని చైతన్య భావిస్తున్నాడని టాక్.