Home / BUSINESS / గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు.

యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను వీటి వినియోగదారులకు పంపుతున్నారు.

చాలా మంసి వీరి మాటలను నమ్మి డబ్బులను పంపిస్తూ మోసపోతున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు గూగుల్ పే,పేటీఎం వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.