సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును ఆకస్మికంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.
మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు మంత్రి సూచన.
కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయని, తాత్కాలిక మార్కెట్లో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సౌలత్ మంచిగుందని, ఇబ్బందులేమీ లేవని మంత్రికి చెప్పిన కూరగాయల రైతులు