తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటివరకూ సాయంత్రం 6 వరకూ మాత్రమే వైన్స్ తెరిచి ఉండేవి. ఇకపై నుంచి.. తెలంగాణలో రాత్రి 8 గంటల వరకూ వైన్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లాక్డౌన్ 5.0ను కేంద్రం విధించినప్పటికీ.. ఆంక్షలను కేవలం కంటైన్మెంట్ జోన్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని షాపులు కంటైన్మెంట్ జోన్లలో తప్ప అన్ని చోట్ల యధావిధిగా తెరిచి ఉంచుతున్నారు.
