Home / SLIDER / గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాహుల్ జిందాల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో రాహుల్ జిందాల్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కార్పొరేట్ దిగ్గజాలు ..
గౌరవ రాజ్యసభ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది .. ప్రపంచ సమాచార సాధనం , మానవునికి ఏదైనా సమాచారం కావలి అంటే గూగుల్ ని అడగకుండా ఉండలేం .. అలాంటి సంస్థకి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ జిందాల్ గారు తన నివాసం , ఛత్తీస్గఢ్ లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేశారు .

అర్జిత్ సర్కార్ విపి గూగుల్ గారు విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఛత్తీస్గఢ్ తన నివాసం లో మొక్కలు నాటారు
ఈ సందర్బంగా రాహుల్ జిందాల్ గారు మాట్లాడుతూ మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం , మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు , ఆలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి ,మన అవగాహనా లోపం తో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అల చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో పాల్గొనాలి అని , తనకు బుద్ధుడు అన్న , అయన ప్రవచనాలు అన్న చాలా ఇష్టం , దాని ప్రకారం బుద్దుడి జీవితం ప్రతి మొక్కలో , చెట్టు వేరులో , కాండం లో , గాలిలో జీవించి ఉంటారు .

అందుకే అందరు మొక్కలు నాటాలి . ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా … ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో ముగ్గురు Shashank Sahin Global Campaign Operations, Sriram Mangudi , CHRO of Neuland Laboratories , Subajith Deb , Global CISO , Dr Reddys Laboratories, Radhika Deshpande, BPM Microsoft . గార్లని గ్రీన్ ఛాలెంజ్ కి నామినేషన్ చేశారు .