తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన, దళిత, పేద విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువును కొనసాగించేందుకు తెలంగాణ జాగృతి సాయం చేసింది.
తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులతో ఏర్పడిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్ల (వీఎల్‌సీ)కు.. మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 50 కంప్యూటర్లు, 500 కుర్చీలను వితరణ చేశారు.
ఈ సాయం కొనసాగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కవితకు మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీఎల్‌సీలతో లాక్‌డౌన్ సమయంలోనూ ఎంతోమంది పేద విద్యార్ధులు చదువును కొనసాగిస్తున్నారు.