మీ డ్రైవిగ్ లైసెన్సును రెన్యువల్ చేయించుకోవాలంటే ఇకపై మీరు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. ఇంటినుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని.. మీ పనులు ముగించుకోవచ్చు.
ఇప్పటికే 5 రకాల సేవలను ఆన్‌లైన్‌లో ఉంచిన రవాణాశాఖ.. తాజాగా బుధవారం మరో ఆరు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటినుంచే ఆన్‌లైన్‌లో సేవలు పొందవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ సేవలతో ఆర్టీఏ కార్యాలయాల్లో పనుల కోసం ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం, గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లోనే ఎంపికచేసిన సేవలను పొందవచ్చని తెలిపారు.
అభివృద్ధిచేస్తున్న మరికొన్ని ఆన్‌లైన్ సేవలను సాంకేతికంగా పరీక్షించిన తర్వాత క్రమంగా ప్రారంభిస్తామని రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు పేర్కొన్నారు