తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నాంపల్లిలోని యుసిఫియన్ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చాదర్ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు.
కవిత వెంట హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు