తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. భారీ ఆధిక్యం దిశగా ఉద్యమ పార్టీ అభ్యర్థి కవిత దూసుకెళ్తున్నారు.
ఈ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వచ్చాయి.
మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్‌లో లెక్కించనున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. విజయానికి అవసరమైన ఓట్లను కవిత ఇప్పటికే సాధించారు.