Home / SLIDER / నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్

నేటినుంచి ధరణీ రిజస్ట్రేషన్

తెలంగాణ రెవెన్యూశాఖలో సోమవారం నూతన అధ్యాయం ప్రారంభం కానున్నది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. గత నెల 29న సీఎం కేసీఆర్‌ పోర్టల్‌ను ప్రారంభించగా.. ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్లు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతాయి. ప్రతి అరగంటకు ఒక స్లాట్‌ చొప్పున కేటాయించారు.మధ్యలో అరగంటపాటు భోజన విరామం ఉంటుంది.

ఈ లెక్కన సగటున రోజుకు 8 స్లాట్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉన్న ది. భవిష్యత్‌లో తాసిల్దార్లు, ధరణి ఆపరేటర్లు మరింత వేగంగా పనిచేయగలుగుతారని, అప్పుడు రోజుకు 10 స్లాట్లు బుక్‌ చేసినా సులభంగా పూర్తి చేయగలుగుతామని అధికారులు చెప్తున్నారు. నిబంధనల ప్రకారం.. రిజిస్ట్రేషన్లన్నీ తాసిల్దార్‌ మాత్రమే అప్రూవ్‌ చేయాల్సి ఉంటుంది. వారు సెలవుపై ఉన్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డిప్యూటీ తాసిల్దార్లకు అవకాశం ఉం టుం ది.

దీన్నిబట్టి తాసిల్దార్లు ఉదయం 10:30 నుం చి 3 గంటల వరకు కచ్చితంగా ఆఫీస్‌లలో ఉండనున్నారు. ఇతర కొన్ని రెవెన్యూ విధు లు, వీఐపీ ప్రొటోకాల్స్‌ను డిప్యూటీ తాసిల్దార్లకు అప్పగించనున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభంకాగా, అన్ని జిల్లాల్లో దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కలిగితే దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు.

వేగంగా స్లాట్‌ బుకింగ్‌

ధరణి పోర్టల్‌ అన్ని సాంకేతిక సమస్యలను అధిగమించింది. ధరణిని ప్రారంభించిన తర్వాత తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నవారు ఒకేసారి లాగిన్‌ అ య్యేందుకు ప్రయత్నించడంతో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. దీంతో కొన్ని సాంకేతిక స మస్యలు తలెత్తాయి. టెక్నికల్‌ సిబ్బంది కూడా కొన్ని సాంకేతిక సమస్యలను గుర్తించారు. ఆ అడ్డంకులన్నింటినీ ధరణి అధిగమించింది. ఓటీపీ క్షణాల్లోనే వస్తున్నది. పేజీ లు, ఆప్షన్లు వేగంగా తెరుచుకుంటున్నాయి. ఫలితంగా స్లాట్‌ బుకింగ్‌ వేగంగా జరుగుతున్నది. ల్యాండ్‌ రికార్డులను చూడాలనుకునేవారికి సైతం వివరాలు వెంటనే ప్రత్యక్షం అవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat