Home / SLIDER / సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్ర‌భుత్వం ఐటీ ట‌వ‌ర్‌ను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం పరిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది. రూ. 45 కోట్ల‌తో కొండ‌పాక మండ‌లం దుద్దెడ గ్రామం వ‌ద్ద ఈ ఐటీ ట‌వ‌ర్‌ను నిర్మించ‌నున్నారు. ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌, టూరిజం హోట‌ల్ మ‌ధ్య‌లో రాజీవ్ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న 60 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ‌నున్నారు.

మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం

సిద్దిపేట జిల్లాకు ఐటీ ట‌వ‌ర్ మంజూరు కావ‌డం ప‌ట్ల రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ ట‌వ‌ర్ నిర్మాణంతో జిల్లాలోని నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హ‌రీష్‌రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఐటీ ట‌వ‌ర్ నిర్మాణానికి శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ముఖ్య‌మంత్రి స‌మ‌క్షంలో ఇన్ఫోసిస్ స‌హా ప‌లు ప్ర‌ముఖ ఐటీ సంస్థ‌లు రాష్ర్ట ఐటీ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఎంవోయూ చేసుకోనున్నారు.