తెలంగాణలో యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.
