ధరణి వెబ్ సైట్లో కొత్త ఆప్షన్ జోడించారు పేర్లలో అక్షర దోషాలు, విస్తీర్ణ నమోదులో తేడా వ్యక్తిగత భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి వాటికోసం ‘అప్లికేషన్ ఫర్ ల్యాండ్ మ్యాటర్స్’ అనే ఆప్షన్ జతచేశారు.
ఇప్పటికే నిషేధిత జాబితా, కంపెనీ భూముల రిజిస్ట్రేషన్లు మీసేవలో దరఖాస్తుకు అవకాశమిచ్చారు. అయితే ఈ కొత్త ఆప్షన్స్ అప్లై చేస్తే నేరుగా కలెక్టర్ కు చేరుతుంది. ఆయన పరిశీలించి వారంలోగా పరిష్కరిస్తారు.