Home / SLIDER / తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం

తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం

కరోనా వ్యాప్తి తగ్గేంతవరకు OTP, ఐరిస్ల ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాన్ని వినియోగించడం ద్వారా వైరస్ ప్రబలే అవకాశముందన్న.. హైకోర్టు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఫిబ్రవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది ఈ విషయమై మార్గదర్శకాలు జారీచేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ కలెక్టర్లకు సూచించారు.