తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత తెలిపారు ఇందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది..
లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పంచవర్ష ప్రణాళిక నిధులను ప్రభుత్వం నేరుగా పంచాయతీలకు అందజేస్తోందన్నారు