సరిగ్గా ఏడేండ్ల కిందట అంటే 2014లో తెలుగులో వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్ ‘దృశ్యం2’ సిద్ధమవనుంది. మార్చి 8 నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మలయాళ వర్షన్ తెరకెక్కించిన జీతు జోసెఫ్ తెలుగులోనూ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు.
సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘దృశ్యం2’ మలయాళ వర్షన్ హిట్ గా నిలవడం తెలిసిందే.