Home / SLIDER / పల్లా రాజేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఎంపీ నామ

పల్లా రాజేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. ఎంపీ నామ

ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీ.ఆర్.ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం నాడు సాయంత్రం కొత్తగూడెం లోని క్లబ్ హాల్ నందు వనమా రాఘవ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారితో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్లమెంట్ లో మాట్లాడితే యావత్ దేశం ఆశ్చర్య పోతుంది కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలను నేడు దేశంలో అమలు చేస్తున్నారన్నారు. ఇంటింటికి మంచి నీరు అన్ని ఇళ్లకు అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్ట్రం అని కేంద్ర ప్రభుత్వ వర్గాల వారే ప్రకటించయన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తున్న నాయకులు కేసీఆర్ గారని ప్రతి విద్యార్థి చదువుకునేలా గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది.

రాష్ట్ర అభివృద్ధి చూసి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయన్నారు వాటిలో తెలంగాణ యువత కి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగిందని .రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో యువత ప్రాధాన్యత పెరిగిందని .నిరుద్యోగ యువతకు లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ఏకైక ప్రభుత్వం టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం అని ఎంపీ నామ స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ప్రతి ఒక్క పట్టభద్రుడు తన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు గారు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు ,సింగరేణి టీ.బి.జే.ఎస్ రాష్ట్ర నాయకులు,ఎమ్మెల్సీ వెంకట్రావు గారు,రాష్ట్ర పార్టీ కార్యదర్శి తాతా మధు గారు,డిసీసీబీ డైరెక్టర్,రాష్ట్ర నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య గారు,కంచర్ల చంద్రశేఖర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.