తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కై ధరణిలో ప్లాట్ బుక్ చేసే వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాక.. అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ కు వెళ్లకూడదనుకునే వారికి వెసులుబాటు ఇస్తూ కొత్త ఆప్షన్ తెచ్చింది. దీని ప్రకారం స్లాట్లు రద్దు చేసుకుంటే ఫీజులన్నీ వెనక్కు ఇవ్వనున్నారు. కాగా ఇటీవలే పలు సమస్యలకు ధరణిలో 10 కొత్త ఆప్షన్లు తీసుకొచ్చారు
