Home / SLIDER / మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

మార్చి 22న సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఈ నెల 22న శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్ పై చర్చ తర్వాత. సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ పై ప్రసంగిస్తారు.

ఆ రోజే పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29-31% శాతం వరకు ఈ ఫిట్మెంట్ ప్రకటించే ఛాన్సుంది. దీనికితోడు కరోనాపై సీఎం కీలక నిర్ణయాలు వెలువరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.