శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.తనకు సహకరించిన మిత్రులకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, ఓట్లు వేసి దీవించిన పట్టభద్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులందరూ ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చారు.
వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. అలాగే ఆర్ఎస్ఎస్ కు పుట్టినిల్లు అని చెప్పుకునే నాగపూర్‌తో పాటు పుణె, ఔరంగాబాద్‌లో కూడా బీజేపీ అభ్యర్థులను పట్టభద్రులు వ్యతిరేకించారు.
కానీ తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వానికి అనుకూలంగా పట్టభద్రులు తీర్పునిచ్చారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు జిల్లాల్లో ఉన్న పట్టభద్రులందరూ ఏకపక్షంగా విజయాన్ని అందించారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఈ ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అయినప్పటికీ అద్భుతంగా కేసీఆర్ నాయకత్వాన్ని పట్టభద్రులు బలపరిచారు అని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు.