Home / SLIDER / టీఆర్ఎస్ లో చేరిన యువకులు..

టీఆర్ఎస్ లో చేరిన యువకులు..

వరంగల్ శివనగర్ కి చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్ తో కలిసి టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్,టీఆర్ఎస్ నాయకుడు పగడాల సతీష్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాద్యమన్నారు.టీఆర్ఎస్ పాలనలో 139 కోట్లతో శివనగర్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు..శివనగర్ ను అద్బుతంగా అభివృద్ది చేసామని,యువతకు ఏ ఇబ్బంది వచ్చినా తనను సంప్రదించాలన్నారు..గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాలన్నారు..ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెంచాల కుమార స్వామి,రెడ్డి కృష్ణ,ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..