Home / MOVIES / యాత్ర సీక్వెల్ లో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు

యాత్ర సీక్వెల్ లో జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మహి వి.రాఘవ్. ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘యాత్ర’ సినిమాతో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ‘యాత్ర 2’ ని కూడా రూపొందించబోతున్నట్టు మహి వి.రాఘవ్. అప్పట్లోనే ప్రకటించారు.

ఇక ఈ సినిమాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు, వైఎస్ రాజా రెడ్డి – జగన్ గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదని ఆయన వెల్లడించారు.

దాంతో ‘యాత్ర 2’లో వైఎస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలోను కలిగింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఇందులో వైఎస్ జగన్‌గా బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat