Home / MOVIES / మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు

మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట.

ప్రస్తుతం మహేశ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్‌ గోవా వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆయన వెళ్లిన ఓ రోజు తర్వాత నమ్రత, పిల్లలు గౌతమ్‌, సితార వెళతారని తెలిసింది.

మూడేళ్ల క్రితం (2018లో) ‘మహర్షి’ సెట్‌లో మహేశ్‌బాబు తన బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈసారి సెట్స్‌లో ఉండాలనుకోవడం యాదృశ్చికమే. మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి ‘బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఓ వీడియో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.