Home / MOVIES / దుమ్ము లేపుతున్న హీరో శ్రీకాంత్ తనయుడి ”పెళ్లి సందD” మూవీ టైటిల్ లిరికల్ వీడియో సాంగ్

దుమ్ము లేపుతున్న హీరో శ్రీకాంత్ తనయుడి ”పెళ్లి సందD” మూవీ టైటిల్ లిరికల్ వీడియో సాంగ్

”పెళ్లి సందD” చిత్రం నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్‌గా ”పెళ్లి సందD” రూపొందుతోంది.

ఇందులో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో కొత్త దర్శకురాలు గౌరి రోనక్ తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా ద్వారా మొదటిసారి రాఘవేంద్రరావు వెండితెరపై సందడి చేయబోతుండటం విశేషం. 

కాగా మెకర్స్ ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యమందించగా, కీరవాణి సంగీతం అందించారు. హేమచంద్ర, దీపు, రమ్య బెహరా కలిసి పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ‘పెళ్లిసందడి’ చిత్రానికి సీక్వెల్‌ కావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.