ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుకి దిమ్మతిరిగే షాక్ లాంటి వార్త. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లు అధికార పార్టీ అయిన వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమైపోయారు.
రెండు మూడ్రోజుల్లో శాసన సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ తీరుపై బుచ్చయ్య తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలియవచ్చింది.
సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనైనట్లు సమాచారం. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది.