ఏపీకి చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీలలు అంటూ మహిళతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
తనను బాధ పెట్టాలని సోషల్ మీడియాలో అలా చేశారని మండిపడ్డారు. మహిళకు ఫోన్ చేశానన్న అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఎంక్వైరీ చేయాలని పోలీసుల్ని కోరినట్లు ఆయన తెలిపారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనకు ఎవరితోనూ శత్రుత్వంలేదని వ్యాఖ్యానించారు. తనపై ఎందుకు అలా చేస్తున్నారో తెలియడం లేదన్నారు. చౌకబారు ఆరోపణలతో తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, దేవుడి పట్ల తనకు నమ్మకం ఉందన్నారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి అవంతి పేర్కొన్నారు.