Home / MOVIES / ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు నేను మరిచిపోలేను-మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ఈ రోజు సెప్టెంబర్ 22. అభిమానులకది మెమరబుల్ డే. కారణం చిరు టాలీవుడ్ లో నటుడిగా తొలి అడుగు వేసిన రోజు. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం ఆయన ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేశారు.

ఆ పై అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అందుకే ఈ రోజు తనకి చాలా ప్రత్యేకమైన రోజని చిరంజీవి నేడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రత్యేకంగా తెలిపారు. ‘22Aug నేను పుట్టినరోజైతే 22Sept నటుడిగా నేను పుట్టినరోజు.

కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు’.. అంటూ చిరు ట్వీట్ చేశారు.