జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీకి చెందిన నేత, మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ అజ్ఞాని అని నాని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. అధికార వైసీపీకి చెందిన ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అధినేత పవన్ సలహాలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. వెళ్లి బీజేపీకి సలహాలు ఇచ్చుకోవాలని విమర్శించారు.
