Home / MOVIES / రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్

రాఖీ భాయ్ ను ఫాలో అవుతున్నఐకాన్ స్టార్

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో… ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో పుష్పరాజ్‌గా బన్నీ నటనకు అఖండ భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. అందుకే రెండో భాగం ‘పుష్ప ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ ను, విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని రెండో భాగం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో బన్నీ గెటప్.. మొదటి భాగానికి భిన్నంగా, మరింత స్టైలిష్ గా ఉండబోతోందని టాక్. ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ కు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన పుష్పరాజ్.. రెండో భాగంలో తన గెటప్ ను ఛేంజ్ చేయబోతున్నాడని వినికిడి.

కేజీఎఫ్’ రెండో భాగంలో యశ్ మాదిరిగా క్లాస్ గా, స్టైలిష్ గా కనిపించబోతున్నాడట. కేజీఎఫ్ కు కింగ్ అయ్యాకా యశ్ మేకోవర్ లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో.. అచ్చంగా అలాగే.. ‘పుష్ప ది రూల్’ లోనూ బన్నీ మేకోవర్ లో అభిమానుల్ని ఆకట్టుకొనే స్థాయిలో మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. మరి పుష్పరాజ్ గెటప్ రెండో భాగంలో ఎంత స్టైలిష్ గా ఉండబోతుందో చూడాలి.  

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino