Home / MOVIES / దుమ్ము లేపుతున్న బుల్లెట్ సాంగ్

దుమ్ము లేపుతున్న బుల్లెట్ సాంగ్

సరైన కథలను ఎంపిక చేసుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన శైలీలో  వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యువహీరో.. ఎనర్జిటిక్ స్టార్   రామ్ పోతినేని. గతంలో పూరీ జగన్నాథ్  ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘ఇస్మార్ట్ శంక‌ర్’ సినిమాతో రామ్ త‌న‌లోని మ‌రో కోణాన్ని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అప్ప‌టివ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌ను ఏర్ప‌ర‌చుకున్న రామ్ ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’తో పూర్తి మాస్ హీరోగా మేకోవ‌ర్ అయ్యాడు. అంతేకాకుండా ఈ చిత్రం త‌ర్వాత రామ్ క‌థ‌ల ఎంపిక పూర్తిగా మారింది. మాస్ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర‌వ్వాల‌నే ఉద్దేశంతో మాస్ క‌థ‌ల వైపే మొగ్గుచూపుతున్నాడు.

గతేడాదిలో వ‌చ్చిన ‘రెడ్‌’లో కూడా సిద్ధార్థ పాత్ర‌లో మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న ఎన్.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ‘ది వారియ‌ర్’ చిత్రంలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూలై 14న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరిస్తుంది.అయితే తాజాగా ఈ చిత్రంలో ‘బుల్లెట్’ లిరిక‌ల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. శ్రీ మ‌ణి సాహిత్యం అందించిన ఈ పాట‌ను త‌మిళ స్టార్ శింబు ఆలపించాడు.

పెప్పి సాంగ్‌గా విడుద‌లైన ఈ పాట మాస్ ఆడియెన్స్‌కోసంమే అన్న‌ట్లు దేవి ట్యూన్‌ను క‌ట్టాడు. ఉస్తాద్ రామ్ స్టెప్స్ అక‌ట్టుకుంటున్నాయి. టాలీవుడ్ టాప్ డ్యాన్స‌ర్‌ల‌లో త‌ను కూడా ఒక‌డు అని ఈ పాట‌తో మ‌ళ్ళి గుర్తుచేశాడు. కాగా ఈ పాట త‌మిళ్ వెర్ష‌న్‌ను ఉద‌య‌నిధి స్టాలిన్ విడుద‌ల చేశాడు. ఈ పాట‌కు దాదాపు 3కోట్ల‌ను నిర్మాత‌లు ఖ‌ర్చుపెట్టార‌ట‌. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించనున్నాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat