ఇటీవల నార్త్, సౌత్ సినిమాల విషయంపై ట్విటర్ వేదికగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ దర్శకు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) స్పందించారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేశారు. కేజీయఫ్ 2, పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌లు కేవలం హిందీలో మాత్రమే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ చేశారని.. ఒక సినిమా ఎన్ని భాషల్లో డబ్ చేయాలన్నది పూర్తిగా నిర్మాతల మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఎన్ని భాషల్లో ప్రేక్షకాదరణ కావాలంటే అన్ని భాషల్లో విడుదల చేస్తారన్నారు.
గతంలో కొన్ని హిందీ సినిమాలను ఇతర లోకల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారని.. కానీ కలెక్షన్స్ రాబట్టలేకపోయాయని ఆర్జీవీ పేర్కొన్నారు. ఇతర భాషల్లో రిలీజ్ అయిన సినిమాలు బాలీవుడ్‌లోనూ హిట్ అవుతున్నాయన్నారు.
ప్రజలు సినిమాలోని కంటెంట్‌ను మాత్రమే చూస్తారని.. అది ఏ భాష అనేది చూడరన్నారు. ప్రభాస్, యశ్, తారక్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ నటించిన సినిమాలు బాలీవుడ్‌లోనూ బ్లాక్ బస్టర్స్ అవుతాయని.. రణ్‌వీర్‌సింగ్, రణ్‌బీర్ కపూర్, అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు టాలీవుడ్‌లో సినిమా చేసి బాలీవుడ్ అంతటి కలెక్షన్స్ సాధించగలరా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తున్నట్లు వర్మ పేర్కొన్నారు. అందుకే టాలీవుడ్,, బాలీవుడ్ అని విభజించడం మానేసి ఆరోగ్యకరమైన పోటీతో సినిమాలు తీయాలని సూచించించారు.