సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో మహేశ్ చెప్పిన డైలాగ్స్ అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తన పాదయాత్ర సమయంలో ఉపయోగించిన మాటను ఈ మూవీలో చిత్రబృందం వాడింది. మహేశ్ చేత ఆ డైలాగ్ చెప్పించడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీ వ్యాప్తంగా జగన్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే మాటను అప్పట్లో ఎక్కువగా అనేవారు. అధికారంలోకి వస్తే ఏమేం చేయబోతున్నాననే విషయాలను సభల్లో ప్రస్తావించేవారు. ఆ క్రమంలో జగన్ నోటి వెంట వచ్చే ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చేది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలోనూ ఓ సందర్భంగా హీరోయిన్ కీర్తి సురేశ్‌తో ఇదే డైలాగ్‌ను మహేశ్ చెప్పారు. దీంతో ఆ డైలాగ్‌ను వైసీపీ, జగన్ ఫ్యాన్స్ తెగ వైరల్‌చేస్తున్నారు.